స్క్రీన్ ప్రొటెక్టర్ కొనుగోలు చేస్తున్నారా అయితే జాగ్రత్త..!
స్క్రీన్ ప్రొటెక్టర్ కొనుగోలు చేస్తున్నారా అయితే జాగ్రత్త..!
మనం సాధారణంగా ఫోన్ కొన్న వెంటనే స్క్రీన్ ప్రొటెక్టర్ కొంటాం. దానిని tempered glass అని అంటారు. అవి ఆన్లైన్ లో అయిన సరే ఆఫ్లఇన్ లో అయిన సరే దాని మీద కొన్ని నెంబర్ లు కనిపిస్తూవుంటాయి. అవే 9H, 9D, 7D, 11D, 2.5D కర్వేడ్ గ్లాస్ మొదలైన రకరకాల పేర్లతో ఈ tempered glass లను అమ్ముతారు. కాబట్టి ఆ glass మీద ఉన్న పేర్లని చూసేపటికి సామాన్య ప్రజలు అయోమయం లో పడతారు. ఎలా అంటే దీనిలో ఏది కొంటె బాగుంటుంది? దేని నాణ్యత ఎక్కువగా ఉంటుంది? మొదలుగున్నవి. మీ దగ్గర ఉన్న ఫోన్ ఖరీదైన కాకపోయిన సరే అందరూ tempered glass వేయడానికి చూస్తారు. మాములుగా స్క్రీన్ ప్రొటెక్టర్ 2 రకాలు: 1. గ్లాస్, 2. ప్లాస్టిక్. ఈ రెండింటిలో ఏది మంచిది అంటే దేని ఉపయోగాలు దానికి ఉన్నాయి.
షాప్ లోనే దీన్ని కొనడం మంచిది. మాములుగా షాప్ వ్యక్తి మీకు తెలిసిన వారైతే ఆ గ్లాస్ ని 50 రూపాయలకే మీకు ఇచ్చేస్తారు. అది కాకుండా మీరు ఆన్లైన్ లో కొనాల్సివస్తే 150, 200 రూపాయల దాకా ఖర్చవుతుంది. ఇప్పుడు మనం నెంబర్ ల గురించి మాట్లాడినట్లైతే అంతకుముందు వచ్చిన ఫోన్లన్నీ 2D వి వచ్చేయి. వాటి యొక్క గ్లాస్ చతురస్రం ఆకారం లో ఉండేది. దాని తర్వాత మొబైల్ యొక్క మోడల్ ని మార్చారు. అదేంటంటే దాని యొక్క గ్లాస్ మూలవైపు కొంచెం కర్వ్ ఆకారంలోకి స్టైల్ గా కనిపించడానికి మార్చారు. దాన్ని 2.5 D గ్లాస్ అంటాం. టెక్నాలజీ పెరిగేకొద్దీ మన ఫోన్ డిజైన్ లు మారుతూ ఉంటాయి. కాబట్టి మనం ఎటువంటి tempered glass తీసుకోవాలంటే మన ఫోన్ యొక్క డిజైన్ ఎలా ఉంటుందో దాన్నిబట్టి ఈ గ్లాస్ మెనుఫ్యాక్చర్ర్స్ చేసేవాళ్ళు కూడా అదే డిజైన్ తో గ్లాస్ లను తయారు చేస్తారు. కాబట్టి ఇటువంటి 7D, 11D లు మనలాంటి సామాన్య ప్రజలను జిమ్మిక్ చేయడానికి, ఎందుకంటే వాటిలో ఉన్న అధికమైన సంఖ్యలను మనం కొన్నట్లైతే మన గ్లాస్ కి ఏ నష్టం రాకుండా ఉంటుందని మనం అనుకోవడానికే ఈ గ్లాస్ లేక స్క్రీన్ ప్రొటెక్టర్ల ప్రయత్నం. కాబట్టి ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అది 7D అయిన 11D అయిన వాటి మధ్య ఎటువంటి తేడాలు ఉండవు
కొన్ని వాటిల్లో 9H అని ఉంటుంది. దాన్ని మనం "Mohs Hardness" అంటాం. ఒక్కప్పుడు ఫెడ్రిక్ మోస్ అనే వ్యక్తి గ్లాస్ యొక్క స్టాండర్డ్ ని సెట్ చేసాడు. అదేంటంటే గ్లాస్ యొక్క రేటింగ్ డిసైడ్ చేసాడు. ఉదాహరణకు గ్లాస్ మీద ఇసుక పోస్తే అది గనుక గీతలు పడితే దానికొక రేటింగ్ ఇచ్చాడు, అలాగే కత్తితో మనం గ్లాస్ ని గీసినప్పుడు గీతలు పడకపోతే దానికొక రేటింగ్ ఇలా 1 నుండి 10 వరకు ఆయన అంకెలతో రేటింగ్ ఇచ్చాడు. దాన్నే "Mohs Hardness Scale" అంటారు. ఇప్పుడు మనం కొనుగోలు చేసే ఫోన్ గొరిల్లా గ్లాస్ తో రూపొందించబడినది అంటారు దాని యొక్క రేటింగ్ 5 - 10 మధ్యలో ఉంటుంది. కాబట్టి ఎక్కువగా ప్లాస్టిక్ స్క్రీన్ ప్రొటెక్టర్ కాకుండా గ్లాస్ దే వేయడానికి ప్రయత్నించండి ఎందుకంటే పైన గ్లాస్ ఒకవేళ పగిలిన కింద గ్లాస్ పగలకుండా ఉంటుంది కాబట్టి.
స్క్రీన్ ప్రొటెక్టర్ కొనుగోలు చేస్తున్నారా అయితే జాగ్రత్త..!
Reviewed by Telugugadgets120
on
ఆగస్టు 17, 2019
Rating:

కామెంట్‌లు లేవు:
If Any Doughts Comment Us