జియో దెబ్బకు 14 ఏళ్లలో మొదటిసారిగా కుప్పకూలిన ఎయిర్‌టెల్
జియో దెబ్బకు 14 ఏళ్లలో మొదటిసారిగా కుప్పకూలిన ఎయిర్‌టెల్
రిలయెన్స్ జియో దెబ్బకు టెలికామ్ కంపెనీలన్నీ విలవిలలాడుతున్నాయి. టాప్ పొజిషన్ లో ఉన్నా భారతీ ఎయిర్‌టెల్ కూడా నష్టాలబాట పట్టింది. జూన్ త్రైమాసికంలో ఎయిర్‌టెల్‌కు భారీ నష్టాలొచ్చాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికానికి రూ.2,866 కోట్ల నష్టాన్ని ప్రకటించింది.
గత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో ఎయిర్‌టెల్ రూ.97 కోట్ల లాభాన్ని ఆర్జించింది. 14 ఏళ్లలో మొదటిసారి కంపెనీ కన్సాలిడేటెడ్ నష్టాన్ని జూన్ త్రైమాసికంలో ప్రకటించింది. రిలయన్స్ జియో వంటి కంపెనీల నుంచి తీవ్రమైన పోటీ ఎదురవుతున్న నేపథ్యంలో కంపెనీకి నష్టాలు తప్పడం లేదు.
రూ.19,799 కోట్ల నుంచి రూ.20,738 కోట్లకు
సమీక్షా త్రైమాసికంలో కంపెనీ రాబడి 4.7 శాతం వృద్ధితో రూ.19,799 కోట్ల నుంచి రూ.20,738 కోట్లకు పెరిగింది. జూన్ త్రైమాసికంలో దేశీయంగా ఒక్కో వినియోగదారుని నుంచి వచ్చిన సగటు రాబడి (ఆర్పు) రూ.129గా ఉంది. మార్చి త్రైమాసికంలో ఇది రూ.123గా నమోదైంది.
14 సంవత్సరాల తర్వాత
దాదాపు 14 సంవత్సరాల తర్వాత తమకు వచ్చిన తొలి నష్టం ఇదని భారతీ ఎయిర్‌టెల్ తెలిపింది. గత క్యూ1లో రూ.97 కోట్ల నికర లాభం, గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.107 కోట్లు చొప్పున నికర లాభాలు వచ్చాయని పేర్కొంది.
జియోతో తీవ్రమైన పోటీ, 3జీ నెట్‌వర్క్ తరుగుదల
రిలయన్స్ జియోతో తీవ్రమైన పోటీ, 3జీ నెట్‌వర్క్ తరుగుదల వ్యయాలు, భారీగా పన్ను వంటి అసాధారణ అంశాలతో ఈ క్యూ1లో ఈ స్థాయి లో నష్టాలు వచ్చాయని వివరించింది. మొత్తం ఆదాయం రూ.19,799 కోట్ల నుంచి 5% వృద్ధితో రూ.20,738 కోట్లకు పెరిగిందని పేర్కొంది. భారత్‌లో ఆదాయం 3%, ఆఫ్రికాలో ఆదాయం 10% చొప్పున పెరిగాయని వివరించింది.
94 శాతం పెరిగిన డేటా ట్రాఫిక్
మొబైల్ కంపెనీల కీలక పనితీరు అంశాల్లో ఒకటైన ఒక్కో వినియోగదారుడిపై లభించే సగటు ఆదాయం(ఏఆర్‌పీయూ-యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్) స్వల్పంగా పెరిగింది. గత క్యూ1లో రూ.123 గా ఉన్న ఏఆర్‌పీయూ ఈ క్యూ1లో రూ.129కు పెరిగిందని ఎయిర్‌టెల్ పేర్కొంది. మొబైల్ డేటా ట్రాఫిక్ 94 శాతం పెరిగిందని తెలిపింది.
జియో దెబ్బకు 14 ఏళ్లలో మొదటిసారిగా కుప్పకూలిన ఎయిర్‌టెల్
Reviewed by Telugugadgets120
on
ఆగస్టు 03, 2019
Rating:
Reviewed by Telugugadgets120
on
ఆగస్టు 03, 2019
Rating:

కామెంట్‌లు లేవు:
If Any Doughts Comment Us